మన ధ్యాస, మక్తల్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తులను గురువారం కర్ణి గ్రామ సర్పంచ్ రాధా దత్తురం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుందని, అందుకుగాను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని భరోసా కల్పించాలనె లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం ప్రారంభించిందని అన్నారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఈ యొక్క అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఈ రోజటి నుండి డిసెంబర్ 18 తారీకు వరకు కొనసాగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో, ఎంపీవో, జిపిఓ కృష్ణయ్య, మాజీ సర్పంచ్ రాఘవేందర్ గౌడ్, వార్డ్ మెంబర్స్ చక్రధర్, కే రవి, మహబూబ్ పాషా, మాజీ ఎంపిటిసి చిన్న రంగప్ప, మహిళా సంఘం బుక్ కీపర్ మమత,భూత్పూర్ శీను, మక్బూల్ హుస్సైన్, హనుమంతు,ఊట్కూరు దత్తు మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

