- శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర సుమారు 500 మందికి అన్నదానం.
మన ధ్యాస, మక్తల్: పట్టణంలో స్థానిక పడమటి ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ శ్రీ సిద్ధ వెంకట సూర్య ప్రకాశ్ రావు,శ్రీమతి జయశ్రీ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు ( వన్ మీల్ వన్ స్మైల్ )మధ్యాహ్నం 2.30 గం. లకు సుమారు 500 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా ల్నిర్వహించడం జరిగిందని వాసవి క్లబ్ అధ్యక్షుడు మేడిశెట్టి హరికృష్ణ తెలిపారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ,గుప్తా దాత సహకారంతో బియ్యం, వాసవి క్లబ్ వారిచే అన్నదానం నిర్వహించగా,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మెడికల్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ వాసవిఎన్ కొండ విజయకుమార్, వాసవియన్ మేడిశెట్టి సంజీవ్ కుమార్ హాజరై కార్యక్రమానికి విశేష ప్రోత్సాహాన్ని అందించారని తెలిపారు.ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 500 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించి తమ ఆకలిని తీర్చుకొని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ, అన్నదానం స్వీకరించిన వారి ముఖాల్లో చిరునవ్వులు చూడటం ఎంతో సంతృప్తినిచ్చింది.ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కన్నా గొప్ప సేవ మరొకటి లేదని తెలిపారు.ఒకరి ఆకలి తీర్చడం ద్వారా వారి ముఖంలో చిరునవ్వు తీసుకురావడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని వాసవి క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొత్త అంజి,కోశాధికారి తాలంపల్లి పవన్ కుమార్,వాసవి క్లబ్ సభ్యులు విజయ్ కుమార్, సంజీవ్ కుమార్,బాలరాజు,ప్రదీప్, జగదీష్,చిన్నారులు అభిజ్ఞ,జశ్వంత్,విశ్వలోచన్,వంశిఖ,నిక్షిత్, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.