

మన న్యూస్: ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం నంది సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన దేవి ఎంబ్రాయిడరీ టైలరింగ్ నూతన షాపును ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళీ కృష్ణంరాజు ప్రారంభించారు.ఈ సందర్బంగా వారి నూతన వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెందుకుర్తి సుశీల అబ్బాయి,ఉప సర్పంచ్ బొల్లు చిట్టిబాబు, ఎంపిటిసి 1 జువ్వల బాబు, ఎంపీటీసీ 3 నానిపల్లి చంటి,నాయకులు కోలా తాతబాబు,బొల్లు నాగేశ్వరరావు,జువ్వల దొరబాబు,పోకనాటి వెంకటేశ్వరరావు,వార్డు సభ్యులు గదుల శివ,గోనగాని గోపి,యువ నాయకుడు యాళ్ల యేసు, గోనగాని రామకృష్ణ,తుపాటి బాబ్జి, బొల్లు సత్తలు,దోమలంక బాబ్జి,సిద్ధ బాబ్జి,మాగాపు శివ తదితరులు పాల్గొన్నారు.