మన ధ్యాస,మక్తల్: పట్టణంలోని శ్రీ వైష్ణవి బాలికల జూనియర్ కళాశాలలో శనివారం రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళాశాలలో బతుకమ్మ పండుగ రోజు తొలి రోజు అయిన ఎంగిలిపూల బతుకమ్మను ముస్తాబుగా పేర్చి, ఆటపాటలతో అలరించారు. అనంతరం మక్తల్ మినీ ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థినిలకు సిబ్బంది వివరించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ శ్రీరామ్, కరస్పాండెంట్ తంగిడి నాగరాజు, ప్రిన్సిపాల్ దిలీప్, సిబ్బంది, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *