నిజాంసాగర్, అక్టోబర్ 2 (మన న్యూస్): మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామపంచాయతీలో స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా శ్రమదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రామపంచాయతీ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బోయిని హరిణ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి శిరీష ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు.పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

గ్రామ పరిశుభ్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సంగయ్య, దుర్గయ్య, పోషయ్యలను ఈ సందర్భంగా అభినందించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలను కొనియాడారు.అనంతరం మండల పరిషత్ ప్రాధమి కొన్నత పాఠశాలలో ప్రభుత్వం అందజేస్తున్న షూస్, బెల్టులు యూనిఫామ్ లను సర్పంచ్ భోజనానికి కుమార్ ప్రధాన ఉపాధ్యాయులు సాయి రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు,ఈ కార్యక్రమంలో: ఉపసర్పంచ్ వెంకట్‌రాములు, ఉపాధ్యాయుడు సాయిరెడ్డి, వార్డు సభ్యుడు చాకలి మైపాల్, మంగలి సాయవ్వ, నాయకులు మొహమ్మద్ గౌస్, ధ్యామగారి గంగారాం కారోబార్ లింగాల రాములు , తదితరులు ఉన్నారు.

