తవణంపల్లి, సెప్టెంబరు 29: మన ద్యాస
మండలంలోని నల్లపరెడ్డి పల్లి ఎంపీపీ పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎస్‌ఎంసీ చైర్మన్‌గా ఏం హారిక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎన్నికల ప్రక్రియను పాఠశాల ఉపాధ్యాయురాలు అర్చన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్‌ హారిక మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు, పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానన్నారు.

ప్రస్తుతం పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తానని హారిక తెలిపారు. తల్లిదండ్రుల్లో పాఠశాలపై నమ్మకం పెంచేలా చర్యలు తీసుకుంటూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులతో కలిసి పనిచేస్తానన్నారు. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్థుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

తాను ఎస్‌ఎంసీ చైర్మన్‌గా ఎన్నిక కావడానికి సహకరించిన పాక్స్‌ చైర్మన్‌ రంజిత్‌రెడ్డి,రూపేష్ గ్రామ పెద్దలు హరి, భువనేశ్వర్‌, నాగరాజుతో పాటు తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హారిక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో పాఠశాలను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు.
ఏం హారిక ఎస్‌ఎంసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఎస్‌ఎంసీ సభ్యులు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *