
తవణంపల్లి, సెప్టెంబరు 29 – మన ద్యాస
తవణంపల్లి మండలం అరగొండ జెడ్ పి బాయ్స్ హైస్కూల్ పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) చైర్మన్‌గా పి. శ్రీనివాసులు ఎన్నికయ్యారు. పాఠశాలలో నిర్వహించిన ఎస్‌ఎంసీ ఎన్నికల్లో ఆయనను చైర్మన్‌గా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ తనను ఎస్‌ఎంసీ చైర్మన్‌గా ఎంపిక చేయడానికి సహకరించిన పాక్స్ చైర్మన్ రంజిత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు. పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తానన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాననిటీచర్స్ తో అలాగే విద్యా శాఖధికారుల సమన్వయంతో ఎంతో చరిత్ర కలిగిన అరగొండ జెడ్ పి బోయ్స్ హై స్కూల్ అభివృద్ధి కి కృషి చేస్తానని తెలిపారు శ్రీనివాసులు ఎస్‌ఎంసీ చైర్మన్‌గా ఎన్నిక కావడంతో పలువురు అభినందనలు తెలిపారు.