నిజాంసాగర్, సెప్టెంబర్ 28 (మన న్యూస్): తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా బాన్సువాడ ఆర్డీఓ రవీందర్‌రెడ్డి శాలువా కప్పి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్ మొక్కను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం గోల్ బంగ్లా పైకి వెళ్లిన శ్రీనివాస్‌రెడ్డి అక్కడి నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు, పరిసర ప్రాంతాలను ఎత్తు నుంచి వీక్షించి ఆనందించారు. ప్రాజెక్టు అందాలు, పచ్చని పరిసరాలను పరిశీలించారు.

అనంతరం గోల్ బంగ్లా వద్ద సుమారు రూ.10 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఏకో టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించారు. కాటేజీల నిర్మాణం, గార్డెనింగ్, బోటింగ్ పాయింట్ తదితర పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టు ఏఈ నవీన్ యాదవ్‌ను చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, నీటి నిల్వలు, నీటి విడుదల, ఆయకట్టు ప్రాంతాలకు అందుతున్న నీటి సరఫరా తదితర అంశాలను ఏఈ నవీన్ యాదవ్ క్లుప్తంగా వివరించారు. ప్రాజెక్టుకు పర్యాటకంగా ఉన్న అవకాశాలు, ఏకో టూరిజం అభివృద్ధి పనుల పురోగతిపై కూడా చర్చించారు.
ఈ కార్యక్రమంలో మీడియా సెక్రటరీ వెంకటేశ్వరరావు, ఓఎస్టీ రహమాన్, జిల్లా ఉపాధ్యక్షుడు యు.బాలయ్య, బాన్సువాడ ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ సాయి భుజంగరావు, జిల్లా కార్యదర్శి రాజేశ్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జీపీఓ సంగమేశ్వర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్, మండల పత్రికా విలేకరులు గుర్రపు వెంకటేశం, లక్ష్మణ్‌దాస్, మహమ్మద్ జునేద్, రహీం, సునీల్, లింగం తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *