నిజాంసాగర్, సెప్టెంబర్ 30, (మన ధ్యాస ): నిజాంసాగర్ మండలంలోని మంగుళూరు గ్రామంలో అచ్చంపేట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ,నిజాంసాగర్ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, డీసీసీ అధ్యక్షుడు ఎలి మల్లికార్జున్ కలిసి కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ ..ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పంటను విక్రయించాలని సూచించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన అనంతరం రైతుల ఖాతాల్లో డబ్బులు త్వరగా జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ప్రస్తుతం ధాన్యం కొనుగోలులో క్వింటాల్‌కు ఏ గ్రేడ్ రూ.2,461, బీ గ్రేడ్ రూ.2,441 ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. రైతులు దళారుల చేతిలో నష్టపోకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్, మండల అధ్యక్షుడు ప్రజా పండరీ, సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి, సర్పంచ్ రాజు, సంకు లక్ష్మయ్య, బొజ్జ అంజయ్య,సీఈఓ సంగమేశ్వర గౌడ్, ఐకెపి ఎపిఎం ప్రసన్న రాణి, సీసీ సాయిలు,నాయకులు గుర్రపు శ్రీనివాస్, చాకలి సాయిలు, రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.