అభినందించిన సలహాదారులు అంజన్ ప్రసాద్, దేవసూగురు సురేందర్, బాల్ రాజ్.

మన ధ్యాస,మక్తల్: మండల నూతన ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా) కమిటీని ఆదివారం సీనియర్ జర్నలిస్టులు, సలహాదారులు అంజన్ ప్రసాద్, దేవసూగూరు సురేందర్, మద్వార్ బాల్ రాజ్ (సాక్షి విలేకరి) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఎన్నికలో ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా) అధ్యక్షులుగా మామిళ్ళ పృథ్విరాజ్, ప్రధాన కార్యదర్శిగా రాజు పెయింటర్, గౌరవ అధ్యక్షులుగా ఎల్లారెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సురేష్ గౌడ్, రఘు, కోశాధికారిగా గోవింద్, కార్యదర్శులుగా ప్రదీప్, సి. సురేష్, కర్నె బాల్ రాజ్, హరిక్రిష్ణ , ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యులుగా నూర్ పాషా, కార్తీక్, వెంకట్ రెడ్డిలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు నూతన కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన ఐక్యత కోసం నూతన కమిటీ కృషి చేయాలని ఈ సందర్భంగా వక్తలు ఆకాంక్షించారు. ఎన్నికైన అనంతరం నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *