​సమాజ సేవ, రక్తదాన రంగాల్లో నిరంతరం శ్రమిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ (ఆంధ్రప్రదేశ్) వైస్ ప్రెసిడెంట్ పసేలి రాజేష్ ప్రతిష్టాత్మక ‘ఉత్తమ సేవా పురస్కారం – 2026’కు ఎంపికయ్యారు. భారత్ రక్తదాన్ సేవా మిషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పురస్కార ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

​ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూర్ టౌన్‌లోని పి స్ లోని పంక్షన్ హల్ నందు ఆదివారం (సెప్టెంబర్ 20, 2026) ఉదయం 9:00 గంటలకు ఘనంగా నిర్వహించబడింది.

​సమాజ శ్రేయస్సే ధ్యేయంగా రక్తదాన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న రక్తదాతలను, సామాజిక సేవకులను గౌరవించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు రక్తదాతలు, సేవాభిలాషులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు.

​ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పసేలి రాజేష్ సేవా నిరతిని కొనియాడుతూ, ఆయనకు అభినందనలు తెలియజేశారు. సమాజ హితం కోసం ఆయన అందిస్తున్న సేవలు మరెందరో యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *