తిరుపతి (ఆగస్టు 13): శ్రీకాళహస్తి టౌన్‌లో విధి నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి ప్రదర్శించిన హెడ్ కానిస్టేబుల్ ( హెచ్ సి -789) యూ . రమణయ్యను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో శాలువాతో సత్కరించి, నగదు రివార్డును అందజేసి అభినందించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళకు సహాయం చేస్తూ, ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్న సమయంలో తనపై కత్తితో దాడికి యత్నించినప్పటికీ ఏమాత్రం భయపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి దాడిని ఎదుర్కొన్న రమణయ్య చొరవ పోలీస్ సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని ఎస్పీ కొనియాడారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. విధి నిర్వహణలో సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఆత్మరక్షణ కోసం లాఠీలను తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకోవాలని సూచిస్తూ, సిబ్బందికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *