.నెల్లూరు., మన ధ్యాస ప్రతినిధి, జూన్ 29 : (విశ్వనాథ సాంబయ్య) నెల్లూరు నగరంలోని స్థానిక శంకర అగ్రహారం,, ఇందిరా భవన్ కి సమీపంలో నూతనంగా ప్రారంభించబడిన రాజ్యలక్ష్మి వైద్యశాల నందు సింహపురి మహిళలకు ప్రత్యేక వైద్య సేవలో అందించడం జరుగుతుందని ప్రముఖ గైనకాలజిస్ట్ వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ ఆర్ రాజలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ రాజ్యలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ….. 15 సంవత్సరాల గైనకాలజీ వైద్య సేవల అనుభవంతో సింహపురి మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి, అధునాతన సదుపాయాలతో వైద్య సేవలో అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సింహపురి మహిళలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. రాజ్యలక్ష్మి హాస్పిటల్ ప్రాంగణంలో ప్రత్యేక లేబరేటరీ, అధునాతన సదుపాయాలతో వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా గర్భవతులు, మహిళలు, బాలికలకు ప్రత్యేక వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ జెట్టి ఉషారాణి, డాక్టర్ మల్లికార్జున రెడ్డి, డాక్టర్ రాజలక్ష్మి, డాక్టర్ శ్రీనివాసులు శ్రీనివాస స్కానింగ్ సెంటర్, డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ రవీంద్రారెడ్డి,డాక్టర్ శేషారెడ్డి,డాక్టర్ శైలజ రెడ్డి, డాక్టర్ ఉమా, డాక్టర్ సునీత బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *