• వర్కింగ్ ప్రెసిడెంట్ గా రావాడ శిరీష

గాజువాక అగనంపూడి జూన్ 29: ఫ్రెండ్స్ హెల్పింగ్ హాండ్స్ సర్వీస్ సొసైటీ సంస్థ కార్యవర్గ మీటింగ్ లో పలు అంశాలు చర్చించి రానున్న కాలంలో మరింత నిరుపేదలకు సహాయ సహకారాలు అందించాలని నిర్ణయం తీసుకుంటూ సంస్థలో నూతనంగా రావాడ శిరీష ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోనీ సాలువాతో సత్కరించడం జరిగినది.ఆమె గతంలో కూడా సంస్థకి సేవలు అందిస్తూ ఉన్నారు.ఈ సందర్భంగా రావాడ శిరీష మాట్లాడుతూ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్ సర్వీస్ సొసైటీ సంస్థలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాకు బాధ్యత ఇవ్వడం నాకు మరింత సేవా భాగ్యం,బాధ్యత పెరిగింది.నన్ను ఎన్నుకున్న కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు.ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలో నిస్వార్ధంగా పనిచేసే కమిటి సభ్యులు గతంలో కూడా నేను ఈ స్వచ్ఛంద సంస్థలో భాగస్వామ్యం అవ్వడం నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.నూతన కార్యవర్గ సభ్యులు సంస్థ గౌరవ అధ్యక్షులు బొంతు కనకరాజు,డాక్టర్ చోడే తాతాజీ,ప్రెసిడెంట్ దివాకర్,సెక్రటరీ కాకర ఉమాదేవి,వైస్ ప్రెసిడెంట్ కడవల నాయుడు,ట్రెజరర్ రూoకాన రాము,గెద్దాడ కృష్ణారావు,అప్పలకొండ,నెల్లి భాస్కర్,కాసా రాజు,సూర్య,కృష్ణ,విందుల రామసాయి,గుదే కనకారావు,హరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *