• ఏ.ఏ.ఏ లీగల్ ఫార్మ్ చైర్పర్సన్ అండి బోయిన లక్ష్మి….

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం( గాజువాక) మే 12: పెద్ద గంట్యాడ మండలం గల ఏ.ఏ.ఏ లీగల్ ఫార్మ్ మొదటి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా అండి బోయిన అడ్వకేట్స్ అండ్ అసోసియేట్స్ కార్యలయంలో ఏ.ఏ.ఏ లీగల్ ఫార్మ్ చైర్ పర్సన్ గాజువాక బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి అండి బోయిన లక్ష్మి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, సాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన గాజువాక వైఎస్ఆర్సిపి మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి,వైయస్సార్ సీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తినిపించడంతోపాటు ఇతర లీగల్సన్ కార్యవర్గాలందరికీ కూడా కేకు పంచడం జరిగింది. ముఖ్య అతిథులు చేతుల మీదగా లీగల్ అవేర్నెస్ క్యాంప్ బ్రోచర్ ను ఆవిష్కరించారు.అండి బోయిన అడ్వకేట్ అండ్ అసోసియేషన్ లీగల్ ఫార్మ్ మేనేజింగ్ డైరెక్టర్ అండి బోయిన అరుణ్ కుమార్ ను సాలువా కప్పి పుష్పగుచ్చంతో అభినందించి లీగల్ అవేర్నెస్ క్యాప్ బ్రోచర్ను ఆవిష్కరించారు.ముఖ్య అతిథి తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ అండి బోయిన అడ్వకేట్ అండ్ అసోసియేట్స్ సంస్థ ప్రజలకు అందుబాటులో ఉంటూ లీగల్ గా పేదలకు ఉచితంగా సలహాలు సూచనలు అందిస్తున్నారు.స్కూల్లో కాలేజీల పిల్లలకు అవేర్నెస్ క్యాంపులు నిర్వహించి పిల్లల్లో లీగల్ గా అవగాహన కల్పిస్తున్నారు.ఈ సంస్థ దినదిన అభివృద్ధి చెందుతూ మరింత ఎక్కువ మందికి సహాయ పడే విధంగా ముందుకు సాగాలని అన్నారు.యువ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ అండి బోయిన అడ్వకేట్స్ అండ్ అసోసియేషన్ లీగల్ ఫార్మ్ చైర్ పర్సన్ అండి బోయిన లక్ష్మి చాలా సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉన్నారు. ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గాఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రస్తుతం జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగాతన సేవలను ప్రజలకు అందిస్తున్నారు.ఈ మధ్య కాలంలో గాజువాక బార్ అసోసియేషన్ లో మహిళా ప్రతినిధిగా ఎన్నికై ప్రజలకు మరింత చేరువులో ఉంటున్నారు.అటు బడుగు బలహీన వర్గాల వారికి సహాయ సహకారాలు అందిస్తూ లీగల్ గా కూడా అందరికీ చేరువులో ఉంటూ లీగల్ గా ఉచిత సలహాలు సూచనలు అందిస్తున్నారు.ఈరోజు మేము ఈ విధంగా సన్మానం చేయడం ద్వారా ఆవిడ మరింత బాధ్యతలు తీసుకొని ముందుకు సాగాలని తెలియజేశారు.అండి బోయిన అడ్వకేట్ అండ్ అసోసియేట్స్ చైర్పర్సన్ గాజువాక బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి అండి బోయిన లక్ష్మీ మాట్లాడుతూ ఏ ఏ ఏ లీగల్ ఫార్మ్ ద్వారా లీగల్ గా స్టూడెంట్స్ కి మహిళలకి అవగాహన కల్పిస్తామని స్కూల్స్ కి కాలేజీలకి వెళ్లి ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కు లీగల్ పై అవగాహన కల్పించి న్యాయవ్యవస్థ వాళ్లనీ శిక్షించే వ్యవస్థ కాదు రక్షించే ఆయుధం అని వాళ్లకి తెలిసే విధంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఇప్పుడున్న యువత అవగాహన లోపం వల్ల సైబర్ నేరాలు మరియు సోషల్ మీడియా వేధింపులకు గురి అవుతున్నారు. న్యాయ పేదవారికి న్యాయ సంబంధితమైన అలాంటి వాటి నుండి ఏ విధంగా వాళ్లని వాళ్ల కుటుంబ సభ్యులను సంరక్షించుకోవాలో అనే దానిపైన అవగాహన కల్పిస్తున్నారు.న్యాయవాదులు కోర్టు నాలుగు గోడలకే పరిమితులు కాదు వారు సమాజానికి రక్షకులు అని తెలియజేశారు.ఈ వేదికగా గాజువాక బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధిగా ఎన్నికైనంద ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అండిబోయిన అప్పారావు,మారుపూడి పరదేశి, శ్రీముసురు శ్రీనివాస్,జాగరపు శ్రీను యాత సంగం అధ్యక్ష కార్యదర్శులు వనము నాగేశ్వరరావు,ఏవి రమణ, వనము రమణ, వంగల నూకరాజు,మల్లుల సూర్యనారాయణ,చప్పిడి నాగరాజు,నెల్లి రాజు,దొమ్మేటి అప్పారావు,బత్తి రాము,కడవల నాయుడు,బత్తిన మోహన్,దొమ్మేటి దేవుడు,సంఘ సభ్యులు యువకులు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *