• తోటి పాత్రికేయులకు నేనున్నానని సాయం చేసే మహోన్నతలు.
  • ఎం.ఎస్.ఆర్. ప్రసాద్ కేవలం గ్రూప్ అడ్మిన్ మాత్రమే కాదు…ఆయన ఒక సేవా స్ఫూర్తి మంచి మనసులను కలిపే వారది
  • గతంలో ఒక పాత్రికేయ కుటుంబానికి 1లక్ష 70000 ఆర్థిక సాయం
  • రెండు లక్షల 230000 ఆర్థిక సాయం అందించడం ఒక్క పిప్పు మేరకే ఎంత సేవ..

మన ధ్యాస ప్రతినిధి విశాఖ జిల్లా మే9: పాత్రికేయులు అంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధి అనే నానుడి.ప్రస్తుత సమాజంలో రక్త సంబంధాలే కరువైన లోకం.నిత్యం ప్రజల్లో ఉంటూ అటు ప్రభుత్వానికి ప్రజల సమస్యలను వివరిస్తూ పాత్రికేయ వ్యక్తి ధర్మాన్ని పాటించడమే కాకుండా తోటి పాత్రికేయులకు అండగా నిలుస్తున్న నగరంలో నేడు అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పాత్రికేయం మిత్రులందరికీ ఒక తాటిపైన నడిపిస్తున్న ఎఫ్ ఎస్ ఆర్ ప్రసాద్. గతంలో ఒక పాత్రికేయ మిత్రుడు అనారోగ్య కారణం వల్ల హాస్పటల్లో చికిత్స పొందడానికి కుటుంబ సభ్యులకు ఉంటున్న వైనంలో తన వంతు సాయంతో పాటు తోటి పాత్రికేయులను కలుపుకుంటూ లక్ష 70 వేల రూ||ఆర్థిక సాయం అందించడం జరిగింది.సమాజంలో ఎవరికైనా కష్టం వస్తే “మనవాళ్లం” అన్న భావంతో ముందుకు వచ్చి సహాయం చేయాలనే తపనను అందరిలో రేకెత్తించే గొప్ప మనసు ఆయనది.

అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టు రవి పరిస్థితిని తెలుసుకున్న వెంటనే, ఆయనకు అండగా నిలవాలనే ఆలోచనతో “నగరంలో నేడు” గ్రూప్ ద్వారా చేసిన పిలుపు విశేష స్పందన తీసుకొచ్చింది.కేవలం 24 గంటల్లోనే రెండు లక్షల 30000 రూ|| పైగా ఆర్థిక సహాయం సమకూరడం, మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపించింది.ఈ సహాయ కార్యక్రమంలో సాధారణ ప్రజలతో పాటు పోలీసు అధికారులు,ప్రజాప్రతినిధులు,మిత్రులు,దాతలు అందరూ ఒక్కటై నిలబడడం విశేషం.విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు స్పందించి ఏడు లక్షల రూపాయలు మంజూరు చేయించడం,ఆల్ఫా కృష్ణ రూ.25 వేల సహాయం అందించడంతో పాటు మరో రూ.10 వేల సహాయాన్ని సమకూర్చడం,ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి వంటి అధికారులు ముందుకు రావడం ఇలాంటి సహాయం వెనుక అందరిలో సేవా భావాన్ని మేల్కొలిపిన ప్రధాన శక్తిగా నిలిచింది ఎం.ఎస్.ఆర్. ప్రసాద్ ఆత్మీయ పిలుపే.“సహాయం చేయండి” అనే ఒక్క మాటతో ఎన్నో మంచి మనసులను కదిలించి,ఒక మనిషి ప్రాణం కోసం సమాజాన్ని ఒక్కటిగా నిలబెట్టగలిగిన ఆయన సేవాస్ఫూర్తి నిజంగా అభినందనీయం. జర్నలిస్టుల కష్టసుఖాల్లో అండగా నిలుస్తూ,అవసరమైన సమయంలో తోడుగా ఉండే నమ్మకమైన వ్యక్తిగా ఆయన అందరి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.మానవత్వాన్ని కార్యరూపంలో చూపిస్తున్న నిజమైన సమాజ సేవకుడు.జర్నలిజం అంటే కేవలం వార్తలు చెప్పడం మాత్రమే కాద సమాజం బాధను తన బాధగా భావించి స్పందించడమూ నిజమైన పాత్రికేయ ధర్మమే అని ఎం.ఎస్.ఆర్. ప్రసాద్ మరోసారి నిరూపించారు.ఆయన పిలుపుతో ముందుకొచ్చిన సహాయం,రవికి మాత్రమే కాదు సమాజానికి కూడా ఒక గొప్ప సందేశమైంది.మానవత్వం,సేవా భావం,నిబద్ధత, సహృదయం ఈ నాలుగు విలువలకు ప్రతిరూపంగా నిలిచిన ఎం.ఎస్.ఆర్. ప్రసాద్ సేవలు మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని హృదయపూర్వకంగా కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *