మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) :మహమ్మద్‌నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామానికి చెందిన కొట్టంల జితేందర్ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.వైద్యులు శస్త్రచికిత్స అత్యవసరమని సూచించగా,ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కుటుంబ సభ్యులుఈ విషయాన్ని సర్పంచ్ గజ్జల జీవన్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి సహకారంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి తీసుకెళ్లారు.బాధిత కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి మానవతా దృక్పథంతో రూ.5 లక్షల వరకు ఎల్ఓసి మంజూరు చేశారు.దాంతో జితేందర్‌కు శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో ఇంటికి చేరుకున్నారు.అనంతరం సోమవారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి పరామర్శించి మనోధైర్యం చెప్పారు. అడగగానే స్పందించి ఎల్ఓసీ ని మంజూరు చేసినందుకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచులు రమేష్ యాదవ్,కుమ్మరి రాములు,కిరణ్,నాయకులు భాస్కర్ రెడ్డి,సాయ గౌడ్, పంచాయితీ కార్యదర్శి రమేష్ ,తదితరులు ఉన్నారు.