తిరుపతి, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ దక్షిణ భారత చీఫ్ కో.ఆర్డినేటర్ గా నియమితులైన మేక్ మైబేబి జీనియస్ స్కూల్ డైరెక్టర్ సంగరాజు అశ్విని ని అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ (అపుస్మా) నాయకులు సోమవారం తిరుపతి కపిలతీర్ధం రోడ్డులోని మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ ప్రాంగణంలో అశ్వనిని దుశ్శాలువతో సత్కరించి పుష్పగుచ్చాలను అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తూ క్రమశిక్షణ బద్ధంగా ఉన్నత శిఖరాలను ఎదిగేందుకు నిరంతరం కృషి చేస్తున్న బహు భాషా సవ్యసాచి అశ్వినిని ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ చీఫ్ కోఆర్డినేటర్ గా నియమించడం అభినందనీయం అని తెలిపారు. ఎంతో మందిలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసి వారిలోని ప్రతిభకు గుర్తింపు తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ కార్య క్రమంలో అపూస్మ రాయలసీమ జోనల్ ప్రెసిడెంట్ ఎన్. విశ్వనాధ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డి.జి. రఘు నారాయణ రావు, తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ ఓ. వెంకట్ రమణ రెడ్డి, ఆర్. ఎస్. శ్రీధర్, ఎస్.ఎమ్. భాషా, డా.హర్షిణి, బి. ప్రసాద్ పాల్గొన్నారు.
