మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని మగ్దూంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన 99 కార్యచరణలో భాగంగా గ్రామపంచాయతీ వర్కర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సమయ, ఉప సర్పంచ్ ప్రవీణ్, గ్రామ అధ్యక్షులు మోహిన్, పంచాయతీ కార్యదర్శి ప్రణీత్ కలిసి గ్రామపంచాయతీ వర్కర్లకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.గ్రామ పరిశుభ్రత మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామపంచాయతీ వర్కర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని వారు తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారి సేవలు ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బి రాజు, మహిపాల్, భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *