మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని మస్జీద్ లో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు.ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని,ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు.రంజాన్ పర్వదినం సోదరభావం, ఐక్యత,పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ది కోసం ఎల్లప్పుడు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,జామే మసీద్ మైనారిటీ అధ్యక్షుడు అనీస్ పటేల్,కాంగ్రెస్ పార్టీ నాయకులు వకీల్ రాంరెడ్డి, గుర్రపు శ్రీనివాస్,గౌస్ పటేల్, ప్రజా పండరి,బంగ్లా ప్రవీణ్ కుమార్,అజయ్ రెడ్డి,గాండ్ల రమేష్,అజారుద్దీన్, మేంగారం శ్రీనివాస్, సర్పంచులు బొజ్జ అంజయ్య, సంకు లక్ష్మయ్య, మోహన్ పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *