తిరుపతి బ్యూరో, మన ధ్యాస నవంబర్ 24:-
(రేణిగుంట) … రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామపంచాయతీ లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న మన ఊరు ఆడపడుచు మా అక్క టగిరి అమరావతి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుందని, ఆమెను సర్పంచ్ గా గెలిపిస్తే వెంకటాపురం గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా అభివృద్ధి వైపు తీసుకెళ్తామని ధనుంజయ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా మంగళవారం అతను మాట్లాడుతూ.. వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలో దొంగతనాలు అసంఘిక కార్యక్రమాలు అడ్డుకట్ట వేయడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు, పంచాయతీ పరిధిలో వైఫై ఏర్పాటు,పంచాయతీ పరిధిలో చదువుకుంటు మంచి మార్కులు సాధించిన విద్యార్థులుకు నగదు ప్రోత్సాహకం, ఉన్నత చదువులు కొరకు, విదేశీ చదువులు కొరకు సహాయం అందించడం, మహిళలకు ప్రత్యేక భద్రత, రైతులకు ప్రత్యేక సంక్షేమం, యువతకు క్రీడా పరికరాలు అందించుట, ఎస్సీ ఎస్టీ బీసీ నివాసిత ప్రాంతాలలో పారదర్శిక పాలన అందించి అభివృద్ధి వైపు తీసుకెళ్తామన్నారు . అలాగే
పంచాయతీలోని ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడం, ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ భరోసా కల్పించడమే మా ధ్యేయమని అన్నారు. అభివృద్ధిలో భాగంగా పంచాయతీ పరిధిలో మౌలిక వసతులు అయినటువంటి త్రాగునీరు, రోడ్ల నిర్మాణం, వీధిలైట్లు, అలాగే ఇతర మౌలిక వసతులతో పాటు, డ్రైనేజీ వ్యవస్థను మార్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు రూపొందిస్తూ దోమలు, ఇతర అంటువ్యాధుల నివారణ ప్రజలకు కాపాడటమే వైద్య ఆరోగ్య శిబిరంతో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే ప్రజల మనిషిగా, ఎవరికైనా ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండి భరోసా కల్పిస్తామని . పంచాయతీలో ప్రజలకు నిత్యం వారి వెంటనే ఉండి సాయం అందించడమే తన బాధ్యత అన్నారు . కావున వెంకటాపురం గ్రామమంతటి ప్రజలందరూ పంచాయతీకి బంగారు భవిష్యత్తు కావాలంటే సర్పంచ్ గా పోటీ చేస్తున్న మా అక్క అమరావతిని ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *