జియ్యమ్మవలస/మనధ్యాస/ మార్చి14 మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసైనికుల మధ్య అత్యంత ఉత్సాహంగా, అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన జనసైనికులు, పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు.
పార్టీ ఆవిర్భావం సందర్భంగా జనసైనికులు కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం జనసేన జెండాను ఎగురవేసి, పార్టీ సిద్ధాంతాలను చాటి చెప్పారు. పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ఆయన ఆశించిన మార్పు కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.కురుపాం నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదును భారీ ఎత్తున చేపట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు.మండలంలో బి.టి. రోడ్లు, సి.సి. రోడ్లు మరియు డ్రైనేజీ కాలువల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, రాబోయే రోజుల్లో జనసేన మరింత క్రియాశీలక పాత్ర పోషిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎటు చూసినా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు వారణాసి శివకుమార్, ఐటి కోఆర్డినేటర్ రంజిత్ కుమార్, పెంట శంకర్రావు, శ్రీరాములు,సురేష్ , మాజీతోటపల్లి దేవస్థానం చైర్మన్ ఆగూరువైకుంఠ రావు, జనసేన నాయకులు బొబ్బిలి వెంకట నాయుడు, జనసేన నాయకులు ఊయక వాస్, లక్ష్మణరావు, ఉమామహేశ్వరరావు, నాయకులు, జనసైనికులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *