మన ధ్యాస | వెదురుకుప్పం,చిత్తూరు జిల్లా | మార్చి 14
ఆదికవిత్రి ఆతుకూరి మొల్ల (మల్లమాంబ) జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా ఎదురు కుప్పం మండలం తిరుమలయ్యపల్లి పంచాయతీ పరిధిలోని మొరవ గ్రామంలో మొల్ల జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
సామాన్య కుటుంబంలో జన్మించిన మొల్ల తన అసాధారణ పాండిత్యంతో తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. రామాయణాన్ని సరళమైన తెలుగులో రచించి పండితులకే కాక పామరులకు కూడా అర్థమయ్యేలా చేసిన తొలి మహిళా కవయిత్రిగా ఆమె చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించారని వక్తలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మొల్ల యొక్క అపూర్వమైన సాహిత్య ప్రతిభను కొనియాడారు. చాలా తక్కువ కాలంలోనే రామాయణాన్ని సులభమైన భాషలో రచించి భక్తి సాహిత్యంలో ఆమె ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ మరియు చిత్తూరు జిల్లా ఓబీసీ మోర్చా ఇంచార్జ్ శ్రీ ప్రేమ్ కుమార్, చిత్తూరు జిల్లా ఓబీసీ అధ్యక్షులు కైలాసం, చిత్తూరు జిల్లా మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ గిరిజా రెడ్డి తదితరులు హాజరై మొల్ల గొప్పతనాన్ని వివరించారు.
ఈ కార్యక్రమాన్ని బీజేపీ ఎదురు కుప్పం మండల అధ్యక్షులు బి. అశోక్ రెడ్డి నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *