
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి,మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్ లో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని ఉత్సవాలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అంతకుముందు ఎమ్మెల్యేను బంజారా నాయకులు ఆడపడుచులు నృత్యాలు చేస్తూ ఫంక్షనల్ వరకు స్వాగతం పలికారు.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బంజారా మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారా సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శి. ఆయన బోధనలు నేటి తరానికి ఆదర్శప్రాయం. బంజారా సోదరులు సామాజికంగా,ఆర్థికంగా, విద్యాపరంగా మరింత ముందుకు వెళ్లేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది అని అన్నారు.అలాగే ప్రభుత్వం బంజారా సోదరుల సంక్షేమం కోసం చేపడుతున్న పలు కార్యక్రమాలను ఎమ్మెల్యే వివరించారు.తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపుతండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి మౌలిక సదుపాయాల కల్పన చేసి విద్య, ఉపాధి అవకాశాల పెంపు కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు బంజారా మహోత్సవాల నిర్వహణ ప్రభుత్వ సహకారంతో బంజారా సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.అలాగే పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.అల్ ఇండియా బంజారా సేవా సంఘం క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు లోక్య నాయక్,ఏ ఐ బి ఎస్ ఎస్ మండల అధ్యక్షుడు రామవత్ గోపిసింగ్ రాథోడ్, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు సవాయ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, బిచ్కుంద మున్సిపల్ కౌన్సిలర్ నౌషా నాయక్, మండల యువజన అధ్యక్షులు సంతోష్ రాథోడ్,తహసీల్దార్ లు లత, భుజంగారావు,ఎంపీడీవోలు శివకృష్ణ,సత్యనారాయణ రెడ్డి,సర్పంచులు రఫీ,హరిన్ కుమార్,కుమ్మరి రాములు, సాయికిరణ్, బంజారా నాయకులు
సర్వాంన్,దశరదం,తదితరులు ఉన్నారు.
