మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం శ్రీహరిపురం జూన్ 11 :ఓమాన్ తీరంలో భారతీయ నౌకపై జరిగిన దాడిలో మృతి చెందిన విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని శ్రీహరిపురానికి చెందిన నావికుడు పట్నాల సురేష్ కుటుంబానికి ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే గణబాబు పరామర్శించారు.శ్రీనివాస్ నగర్‌లోని సురేష్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే గణబాబు. గణబాబు సురేష్ భార్య పిల్లలు మరియు తల్లిదండ్రులను కలిసి తీవ్ర దిగ్భ్రాంతిని,సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ కష్టసమయంలో ప్రభుత్వం సురేష్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.సురేష్ మృతదేహాన్ని త్వరితగతిన స్వగ్రామానికి తీసుకువచ్చేలా అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఈ వార్తతో శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *