మన ధ్యాస,నిజాంసాగర్ : జుక్కల్ నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ శివారులోని బేడీల మైసమ్మ తల్లి ఆల యంలో వార్షికోత్సవ వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించారు.సందర్భంగా గ్రామంలో ఉన్నా ప్రతి ఇంటి నుంచి పెద్ద ఎత్తున మహిళలు ప్రతి ఇంటి నుంచి బోనాలను డప్పుల చప్పుళ్ల తో,బ్యాండు మేళాలతో,పోతరాజుల విన్యా సాలతో ఉరేగింపుగా బీడీల మైసమ్మ ఆలయం వద్దకు చేరుకుంటారు. అనంతరం ఆలయం చుట్టూ బోనాలతో ప్రదక్షిణలు చేశారు.భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ ప్రజలను,
పాడి పంటలను చల్లగా కాపాడాలని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా బోనాలు సమర్పిస్తామన్నాని గ్రామ పెద్దలు తెలిపారు.వార్షికోత్సవాలల్లో భాగంగా సోమవారం కుస్తీ పోటీల నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామ పెద్దలు పటోళ్ల దుర్గారెడ్డి,అజ్జం దుర్గయ్య,రామాగౌడ్, మహేందర్ రెడ్డి,గోలి లక్ష్మణ్, శ్రీకాంత్ రెడ్డి,ప్రకాష్,భక్తులుతదితరులు పాల్గొన్నారు.