వింజమూరు, మన న్యూస్, జనవరి 23,(నాగరాజు కె ).

యువతకు ఉపాధి కల్పించడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు.
యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని వింజమూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిన్న ఘనంగా నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలానే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దుత్తలూరు మండలంలో జన్మదిన వేడుకలు సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన మన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్న మరియు మాజీ శాసనసభ్యులు కంభం విజయరామి రెడ్డి గారు, మండల కన్వీనర్ ఉండేల గురవారెడ్డి, నర్రవాడ మాజీ సర్పంచ్ మల్లంపాటి గురవనాయుడు, మాజీ సొసైటీ అధ్యక్షులు అన్నపరెడ్డి వెంగల్ రెడ్డి మరియు మండల నాయకులు చేతుల మీదగా పేద ప్రజలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లెక్కల వెంకటరెడ్డి, లక్కిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, బాణ భాస్కర్ రెడ్డి ,లెక్కల మాల కొండారెడ్డి, బడే కొండారెడ్డి, చింతగుంపల కృష్ణ చౌదరి మరియు కార్యకర్తలు ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *