సీఎం చంద్రబాబు పాలనలో ప్రతి ఇంట సంతోషం…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి – కందుకూరులో దాదాపు 250 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు – కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపడంలో ఎమ్మెల్యే పాత్ర కీలక మన ధ్యాస, కందుకూరు,జనవరి 12 :ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతి ఇంట సంతోషం కనిపిస్తోందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. 2029లో కూడా కూటమి ప్రభుత్వమే వస్తుందని చెప్పారు. లింగసముద్రం మండలం అంగిరేకులపాలెం, జంగాలపల్లిలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 విపిఆర్ అమృత ధార వాటర్ ప్లాంట్లను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. అంగిరేకులపాలెం లో సిమెంట్ రోడ్లు, గోకులం షెడ్లను వారు ఓపెన్ చేసారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కళ్లలో నేడు సంతోషం కనిపిస్తోందంటే అది సీఎం చంద్రబాబు పాలన వల్లే సాధ్యమన్నారు. ప్రతి గ్రామంలో అభివృధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. 1వ తేదీనే పింఛన్లు అందిస్తున్నారని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి లో ముందుకు తీసుకుపోతున్నారని చెప్పారు. ప్రజలకు అవసరం అయిన పనులు మాత్రమే చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేస్తున్నారన్నారు. కందుకూరు మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలవడంలో ఆయన కృషి చాలా ఉందన్నారు. నియోజకవర్గంలో వివిధ బ్రిడ్జి ల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2017లో ఏర్పాటు చేసిన ప్లాంట్స్ కూడా ఇప్పటికీ పని చేస్తున్నాయని వివరించారు. విపిఆర్ నేత్ర ద్వారా మూడు మండలాల్లో 15 వేల మందికి ఉచితంగా కంటి పరీక్షలు, 8వేల మందికి అద్దాలు అందజేసినట్లు చెప్పారు. నియోజకవర్గంలో 145 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందించినట్లు తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధితో కందుకూరు నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఎలాంటి ఢోకా ఉండదన్నారు.ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గతంలో ఎంపీలు అంటే గ్రామాల్లో ఒక్కరోజు కూడా వచ్చేవారు కాదని, కానీ నేడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే నిత్యం ప్రజల మధ్యే తిరుగుతుంటారని చెప్పారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు 3 విపిఆర్ అమృత ధార వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించామని, వందలకోట్ల అభివృద్ధి పనులు కేటాయిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా దాదాపు 10 కోట్ల రూపాయలు ప్రజలకు అందించారన్నారు. బిపిసిఎల్ కంపెనీ, ఇండోసోల్ సోలార్, రామాయపట్నం పోర్టు ఏర్పాటుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచి మాధవి, శ్రీనివాస్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు గురునాథం, మనోహర్, రంగయ్య, వీరస్వామి, సాంబయ్య, రఫీ, ప్రసాద్ మాధవ, రామారావు, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.





