మన ధ్యాస, కోవూరు జనవరి 12:నెల్లూరు లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ………1863 జనవరి 12 వ తేదీన జన్మించిన స్వామి వివేకానంద కేవలం 39 సంవత్సరాలే జీవించినా, ఒక యుగానికి అవసరమైన స్ఫూర్తిని యువతలో నింపారు అని అన్నారు.133 సంవత్సరాల క్రితం చికాగో లో ఆయన చేసిన ప్రసంగం గురించి ఇంకా మాట్లాడు కుంటున్నామంటే ఆయన తన ప్రసంగం ద్వారా దేశ ప్రజలను ఎంత ప్రభావితం చేసారో అర్థమౌతుంది.ఈ ప్రసంగం ద్వారా భారతదేశ సంస్కృతి ని,దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు అని అన్నారు.ఈ ప్రసంగం ద్వారా యువతకు స్పూర్తి నింపే బోధనలు చేశారు అని అన్నారు. నీవు దేనిని తలుసుకుంటే అదే అవుతావు. నిన్ను నీవు బలహీనుడువు అనుకుంటే బలహీనుడు వే అవుతావు.బలవంతుడిని అనుకుంటే బలవంతుడువే అవుతావు అని వివేకానంద చెప్పిన ఈ మాట నేటికి యువతకు స్పూర్తి గా తీసుకోవాలి అని అన్నారు.ప్రపంచ దేశాల్లోని యువత మన సంస్కృతి వైపు ఆకర్షితులు అవుతుంటే మన యువత విదేశీ సంస్కృతీ వైపు ఆకర్షితులు అవుతున్నారు.ఈ తరుణంలో స్వామి వివేకానంద బోధనలు గురించి ప్రభుత్వాలు విస్తృత ప్రచారం కల్పించినేటి యువత లో స్పూర్తి ని నింపాలి అని అన్నారు.వివేకానంద జయంతి ని జాతీయ యువజన దినోత్సవం గా జరుపుతున్న ప్రభుత్వాలు వివేకానంద బోధనల పై యువతలో స్పూర్తి నిపేవిధంగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలి అని అన్నారు.స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ వారి చూపిన మార్గంలో అందరం పయనిద్దాం అని అన్నారు.మానవసేవే మాధవసేవ అనే సూక్తి ద్వారా మానవ సేవ చేయడమే నిజమైన సేవ అని వివేకానంద చెప్పిన స్పూర్తితో స్వర్గీయ నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అనే మూల సిద్దాంతం తో తెలుగుదేశం పార్టీ ని స్థాపించారు.ఆ సిద్ధాంతాన్ని ఆచరించి చూపించారు అని అన్నారు.పై కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు కంచి జ్ఞానేంద్ర, తాళ్ల నరసింహ స్వామి, దర్శి హరికృష్ణ, నెల్లూరు మురళి, గోవిందరాజులు,శ్రీదేవి, షేక్ రసూల్,ఉప్పు భాస్కర్, బాబు గౌడ్,ఖాజనా బ్రహ్మయ్య, బాపనపల్లి శశిధర్, యర్రా ధనుంజయ్య, చింతగుంటశేషు, యం సి సుబ్రహ్మణ్యం, వల్లూరు బాల, వి మన్నారు స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *