బ్రహ్మసముద్రం, మనధ్యాస: బ్రహ్మసముద్రం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు, నాగిరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు కురుబ గంగమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి వార్త తెలుసుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సోమవారం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే అమిలినేని, గంగమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గంగమ్మ కుమారుడు, మాజీ మండల కన్వీనర్ వెంకటేషులు, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ సందీప్‌లను ప్రత్యేకంగా పరామర్శించి, ఈ కష్ట సమయంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.పార్టీ అభివృద్ధికి, మండల రాజకీయాలకు గంగమ్మ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆమె మృతి పార్టీకి, బ్రహ్మసముద్రం మండలానికి తీరని లోటని అన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గంగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *