యాదమరి, మన ధ్యాస డిసెంబర్ 21: 2013–14 విద్యాసంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన డి.కె చెరువు హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఆదివారం యాదమరిలో ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆనాటి ప్రధానోపాధ్యాయులు ఎ.యం. బాలాజీతో పాటు గణిత ఉపాధ్యాయులు కనకాచారి, సైన్స్ టీచర్లు జానకిరాం మందడి, దినకర్, భాషా పండితులు కరీం, ఎ.కృష్ణమూర్తి, సురేంద్ర, మాధవి, గిరిష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గురువులను శాలువాలతో ఘనంగా సత్కరించి, సన్మానం చేసి, జ్ఞాపికలు అందజేశారు. ఆ పదవ తరగతి బ్యాచ్‌లో మొత్తం 27 మంది విద్యార్థులు చదువుకున్నారని నిర్వాహకులు తెలిపారు. సీనియర్ ఉపాధ్యాయులు కనకాచారి మాట్లాడుతూ—గురువులు తమ సంతానానికి చూపే ప్రేమకన్నా ఎక్కువగా తమ వద్ద చదివే విద్యార్థులపై ప్రేమ, అనురాగం చూపిస్తారని పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి, ఉపాధ్యాయులకు విద్యార్థులు ఆనందంగా తినిపించారు. క్రమశిక్షణ, అప్యాయత, ప్రేమానురాగాలతో ముడిపడిన విద్యార్థులు డి.కె చెరువు హైస్కూల్‌కు ప్రత్యేకత అని ఉపాధ్యాయులు ప్రశంసించారు. ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థులు–గురువుల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరిచిందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
