
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరంలో గణిత శాస్త్ర విభాగ ఇన్చార్జ్ కే సురేశ్ ఆద్వర్యంలో జాతీయ గణిత దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత ముందుగా రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్డులను ఉద్దేశించి ప్రిన్సిపల్ మాట్లాడుతూ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటామని,శ్రీనివాస రామానుజన్ (1887-1920) ఒక గొప్ప భారతీయ గణిత మేధావని, వీరు సంఖ్యా సిద్ధాంతం,అనంత శ్రేణులు, గణిత విశ్లేషణ వంటి రంగాలలో అద్భుతమైన కృషి చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరచారని,32 సంవత్సరాల చిన్న వయస్సులోనే మరణించారని, కాగా 1729 వంటి సంఖ్యల ద్వారా చిరస్మరణీయులయ్యారని కొనియాడరు.గణితం అన్ని శాస్త్రాలకు తల్లి వంటిదని గణిత శాస్త్రం లేకుండా ప్రపంచం ఏ రంగాలలోను ముందంజ వేయలేదని దైనందిన సమస్యల పరిష్కారానికి గణితం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎక్కడ ఏ పరిశోధనలకు గణితమే ప్రాతినిధ్యం వహిస్తున్నదని.గణితం కృత్రిమ మేధ (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్) బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, సైబర్ భద్రత, క్రిప్టోగ్రఫీ వంటి వివిధ రంగాలలో కొత్త పరిశోధనలకు, సమస్యల పరిస్కరానికి గణితమే ప్రధానమన్నారు. ప్రపంచములో గణితం నిరంతరం మారుతున్న రంగాలలో వ్యాపారాలు, ప్రభుత్వాలు తమ నిర్ణయాలు తీసుకోవడానికి గణిత నైపుణ్యంపై ఆధారపడతాయన్నారు. భూమి వాతావరణం, గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని బాగా అర్థం చేసుకోవడానికి పరిశోధకులను అనుమతించడం ద్వారా గణితశాస్త్రం వాతావరణ మార్పుల అధ్యయనానికి గణనీయమైన సహకారం అందించిందన్నారు. అంటు వ్యాధులు, వాటి మూలాలు, వాటి వ్యాప్తి, నియంత్రణకు సంబంధించి భూమి లోని సహజ వ్యవస్థల డైనమిక్స్‌ను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని . గణితం ప్రతి అంశం లేదా ప్రతిరోజూ మన జీవితాలను ప్రభావితం చేస్తుందని ప్రజలు పనిచేసే రంగంలో, అది వైద్యం, వాతావరణ శాస్త్రం లేదా క్రిప్టోగ్రఫీ మొదలైన వాటిలో గణితం ముఖ్య భూమిక పోషిస్తుందని తెలియజేశారు. విద్యార్డులకు ఆన్లైన్ ద్వారా క్విజ్ నిర్వహించి గెలుపొందిన విధ్యార్డులకు బహుమతులను ప్రిన్సిపాల్ చేతుల మీదుగా అందించారు. కార్య క్రమంలో వైస్ ప్రిన్సిపల్ కె. వేంకటేశ్వర రావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. ప్రయాగ మూర్తి ప్రగడ, అధ్యాపకులు వి రామ రావు ఎస్కే మదీనా డా. వప్రసాద్. వీరభద్ర రావు, శ్రీ లక్ష్మిడా. కె బంగార్రాజు,మేరి రొసిలిన పుష్పా, సతీశ్,రాజేశ్ మరియు అధ్యాపకేత సిబ్బంది పెద్ద సంఖ్యలో విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.