మన ధ్యాస ,ముత్తుకూరు, డిసెంబర్ 19: నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని మత్స్య కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాను ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……జాబ్ మేళాకు 258 మంది హాజరు కాగా 113 మందికి ఉద్యోగాలు.. పరిశీలనలో మరో 42 మంది అభ్యర్థులు ఉన్నారు అని అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్వేపల్లిలో మూడో జాబ్ మేళా నిర్వహిస్తున్నాం అని అన్నారు.మొదట విక్రమ సింహపురి యూనివర్సిటీలో, రెండోది పొదలకూరులో నిర్వహించాం అని అన్నారు.ప్రముఖ కంపెనీలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయి అని అన్నారు.సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ బాబు సారధ్యంలో రాష్ట్రానికి లక్లల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి అని అన్నారు.గత ప్రభుత్వంలో పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోయిన పరిస్థితి…ఇప్పుడు ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఏపీ వైపు చూస్తున్నాయి అని అన్నారు.ముత్తుకూరుకు సమీపంలో క్రిస్ సిటీ రాబోతోంది..పరిశ్రమలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు అని అన్నారు.దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన కింద యువతకు ఉపాధి శిక్షణ చేపడుతోంది అని అన్నారు.పదో తరగతి పైన విద్యార్హత కలిగిన వారు ఉపాధి శిక్షణ పొందవచ్చు అని అన్నారు.2014-19 మధ్య ఎంతో విజయవంతంగా నిర్వహించబడిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లపై వైసీపీ ప్రభుత్వం కక్షకట్టింది అని అన్నారు.స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను మూసివేయడంతో పాటు చంద్రబాబు నాయుడిని జైలుకు పంపడం వంటి దుర్మార్గాలకు పాల్పడింది అని అన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి అని అన్నారు.విజనరీ లీడర్ గా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే ముందున్నారు అని అన్నారు.చంద్రబాబు నాయుడు పని తనాన్ని గుర్తించి ది ఎకనమిక్ టైమ్స్ మీడియా సంస్థ బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ గా ఆయనను గౌరవించింది అని అన్నారు.ఇప్పటి వరకు చాలా కొద్ది మంది ప్రముఖ వ్యక్తులకు మాత్రమే ఈ అవార్డు లభించింది అని అన్నారు.చంద్రబాబు నాయుడికి ఈ అవార్డు దక్కడంపై తెలుగు ప్రజలందరం గర్వపడుతున్నాం అని అన్నారు.ఈ ఘనతను జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు అని అన్నారు.వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమలను కుప్పకూల్చేసిన వ్యక్తి ఆయన అమర్ రాజా కంపెనీని తెలంగాణకు, కియా అనుబంధ పరిశ్రమలను కర్ణాటకకు తరిమేశారు అని అన్నారు.రాష్ట్రానికి రావాల్సిన లక్షల కోట్ల పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డిని చూసి వెనక్కివెళ్లిపోయిన పరిస్థితి అని అన్నారు.ఇప్పుడు చంద్రబాబు నాయుడి కష్టపడే తత్తం, విజనరీతో రాష్ట్రం పూర్వవైభవం దిశగా ముందుకు సాగుతోంది అని అన్నారు.





