మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 19: నెల్లూరు నగరంలోని 51 డివిజన్ కపాడిపాలెంలో డివిజన్ ఇంచార్జ్ సందీప్, డివిజన్ నేతలు ఉమా , కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ……సెమి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని.. పేదలకు వస్త్రాలు పంపిణీ చేసి.. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.క్రిస్మస్ పండుగ అంటేనే.. క్రైస్తవులకు అతి పవిత్రమైనదని.. ఈ పండుగ పరమార్థం సేవేనని అన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువమంది క్రైస్తవులు.. నివసిస్తూ క్రిస్మస్ వేడుకలను.. ప్రతి ఏటా ఎంతో అట్టహాసంగా.. నిర్వహిస్తుండడం.. సంతోషకరమని తెలిపారు. సేవ గుణం కలిగిన క్రైస్తవులు.. తమకు ఉన్న దానిలో కొంత భాగం.. పేదలకు దానం చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండడం వారి సేవా గుణానికి నిదర్శనం అన్నారు.ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకొని.. ఉన్నదానిలో కొంత పరులకు దానం చేసి.. సమాజంలో అందరూ ఒకటే అన్న భావన కలగజేయాలని పిలుపునిచ్చారు. *51, 52 డివిజన్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటివని.. ఈ డివిజన్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారని తెలిపారు.* మళ్లీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడుతుందని.. అప్పుడు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 52,11, 9 డివిజన్ ఇన్ చార్జ్ లు మహబూబ్ బాషా, మహేష్ యాదవ్,ధనుజా రెడ్డి, 51వ డివిజన్ కోఆర్డినేటర్ బాల ప్రసాద్, వైసీపీ నేతలు సరిత, ప్రమీల, శాంతి, కరుణ, అన్నమ్మ, సుజాత, సునీల్, రాహుల్, వర ప్రసాద్,రవి, హేమంత్, సునీల్ తదితరులు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *