మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఆనాడు ధర్మ స్వరూప్ నఖర ద్వారా సుప్రీంకోర్టు పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు తీర్పు డిసెంబర్ 17వ తేదీ 1982 సంవత్సరంలో వెలువడి నుండి ప్రతి సంవత్సరం పెన్షన్స్ డే జరుపు కుంటున్నట్లు విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వి. రామచంద్రరావు కార్యదర్శి ఏవి ప్రసాద్ సలహా కమిటీ సభ్యులు సీనియర్లు అయినా జహరిద్దీన్,వి. ఎస్.అస్మాన్, నఖరా గూర్చి వెల్లడించారు. బుధవారం స్థానిక విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగిన పెన్షన్స్ డే కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు వి. రామచందర్రావు అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ 1982 డిసెంబర్ 17వ తేదీన ఆనాటి సుప్రీంకోర్టు తీర్పుతో దేశమంతా డిసెంబర్ 17వ తేదీని పెన్షన్స్ డే గా విశ్రాంతి ఉద్యోగులు ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కోశాధికారి తాతారావు ఇబ్రహీం ఖాన్లు సంఘము యొక్క ఐక్యత గురించి వివరించారు. సంఘం మాజీ కార్యదర్శి జోగురాజు మాట్లాడుతూ పెన్షన్స్ అడిషనల్ కౌంటర్ సప్లిన్స్ గూర్చి వివరంగా తోటి ఉద్యోగులకు అర్దం అయ్యే రీతిలో వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పెన్షనర్స్ సానా వెంకటేశ్వరరరావు, వేమరుపాక నారాయణరావు కుటుంబ పెన్షన్ దారులైన ఆర్ భూషణమ్మ వై సుశీల లను ఈ సందర్భంగా సన్మానించారు. అనంతరం విశ్రాంతి ఉద్యోగులంతా తేనేటివిందు సేవించి జనగణమన గేయంతో కార్యక్రమాన్ని ముగించారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *