బంగారుపాళ్యం,మనధ్యాస, డిసెంబర్ 16

ఈ నెల 5వ తేదీన అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందిన బంగారుపాళ్యం మండలం కల్లూరుపల్లె తలారి దేవరాజు కుటుంబ సభ్యులను మంగళవారం సాయంత్రం కల్లూరుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి కమలాపతిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్వహణలో నిజాయితీగా వ్యవహరిస్తూ ఆకస్మికంగా మృతి చెందిన దేవరాజులు కుటుంబ సభ్యులను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, ముని కన్నయ్య,హరి , ప్రసాద్, కిరణ్, రఘు పాల్గొన్నారు. తదుపరి మృతుడు తలారి దేవరాజులు కుమారుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ రెవిన్యూ శాఖలో గత 40 ఏళ్ల పాటు తలారిగా విశిష్ట సేవలను అందించి గత నెల 5 వ తేదీన మరణించిన తన తండ్రి దేవరాజులు శుభ స్వీకరణ కార్యక్రమాన్ని ఈ నెల 17 వ తేదీన బుధవారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కడు పేద కుటుంబంలో జన్మించిన మా తండ్రి తలారి దేవరాజులు తన విధి నిర్వహణలో మచ్చలేని వ్యక్తిగా నిలిచారని పేర్కొన్నారు. తమను సైతం అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారని, తాము సైతం తమ తండ్రి బాటలో నడుస్తూ అంకితభావంతో పనిచేస్తామన్నారు. ఈనెల 17 వ తేదీన బంగారుపాళ్యం మండలం కల్లూరుపల్లెలోని మా స్వగృహంలో తమ తండ్రికి నిర్వహించనున్న శుభ స్వీకరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *