ఉదయగిరి,మన ధ్యాసన్యూస్, డిసెంబర్ 5,(కె నాగరాజు). ఉదయగిరి మండలం దేవలాలగడ్డ వీధికి చెందిన షేక్ కుబ్రాబీ బుధవారం నాడు ఉరివేసుకొని మృతిచెందిన విషాదకర సంఘటన అందరికీ విధితమే. ఈ ఘటనపై గ్రామంలోని స్థానిక నాయకులు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కి సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ఆమె అంతిమ యాత్రకు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు షేక్ కుబ్రాబీ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, అసలు నిజాలు వెలుగు చూడాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యే ని వేడుకున్నారు. కుటుంబ సభ్యుల విన్నపాన్ని ఓర్పుతో విన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , ఈ కేసును పోలీసు అధికారి ద్వారా సమగ్రంగా దర్యాప్తు చేయించి, ఎలాంటి అన్యాయం జరగకుండా పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.







