పీఈఎస్ కు దక్కిన నెంబర్ వన్ ర్యాంకు

చిత్తూరు, మనధ్యాస, డిసెంబర్ 5

స్కూల్ మెరిట్ అవార్డ్స్ – 2025 లో భాగంగా శుక్రవారం బెంగళూరులో ఇండియా టాప్ స్కూల్ విన్నర్స్ ను సత్కరించారు. 2,167 పాఠశాలలను సర్వే చేసి,15 రకాల పనితీరులను, 400 సిబిఎస్ఇ, ఐసిఎస్ఇ పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో చిత్తూరు నగరం శివారులోని పీఈఎస్ పబ్లిక్ పాఠశాల మొదటి ర్యాంకు సాధించింది. ఈ నేపథ్యంలో ఎడ్యుకేషన్ న్యూస్ నెట్వర్క్ సంస్థ చేతుల మీదుగా పీఈఎస్ పబ్లిక్ పాఠశాల ప్రిన్సిపాల్ వైవి కృష్ణబాబు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కృష్ణబాబు మాట్లాడుతూ గత ఏడాది సైతం తమ పాఠశాలకు మొదటి ర్యాంకు రావడం జరిగిందన్నారు. రెండవసారి కూడా పాఠశాలకు మొదటి ర్యాంకు రావడం చాలా గర్వించదగ్గ విషయమని, ఈ ర్యాంకు రావడానికి పిల్లల నైపుణ్యం, తల్లిదండ్రుల తోడ్పాటు, ఉపాధ్యాయుల కృషి, యాజమాన్యం యొక్క సూచనలే కారణమన్నారు. తమ పాఠశాలలో సుక్షితులైన అధ్యాపకులను నియమించుకోవడం, అత్యాధునిక బోధనా పద్ధతులను అమలు చేయడంలో రాజీ పోయే ప్రసక్తే లేదన్నారు. తమ పాఠశాల నంబర్ వన్ ర్యాంకు సాధించడానికి సహకరించిన పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Posts

శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

మన ద్యాస ప్రతినిధి, సాలూరు : – మండలంలోని మామిడి పల్లి శ్రీ సరస్వతీ శిశు మందిర్లో కమిటీ సభ్యులు, ఆచార్యులు నిర్వహించిన సప్త శక్తి సంగం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వక్తల సందేశాన్ని…

అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

మన ధ్యాస ప్రతినిధి , సాలూరు డిసెంబర్ 7:- స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం. స్నేహం కంటే గొప్పబంధం మరేది లేదని 1987 సంవత్సరం పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పదవతరగతి బ్యాచ్ రుజువు చేసింది. ప్రతీ సంవత్సరం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి  స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

*ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

*ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం