
చిత్తూరు, మనధ్యాస, డిసెంబర్ 5
స్కూల్ మెరిట్ అవార్డ్స్ - 2025 లో భాగంగా శుక్రవారం బెంగళూరులో ఇండియా టాప్ స్కూల్ విన్నర్స్ ను సత్కరించారు. 2,167 పాఠశాలలను సర్వే చేసి,15 రకాల పనితీరులను, 400 సిబిఎస్ఇ, ఐసిఎస్ఇ పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో చిత్తూరు నగరం శివారులోని పీఈఎస్ పబ్లిక్ పాఠశాల మొదటి ర్యాంకు సాధించింది. ఈ నేపథ్యంలో ఎడ్యుకేషన్ న్యూస్ నెట్వర్క్ సంస్థ చేతుల మీదుగా పీఈఎస్ పబ్లిక్ పాఠశాల ప్రిన్సిపాల్ వైవి కృష్ణబాబు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కృష్ణబాబు మాట్లాడుతూ గత ఏడాది సైతం తమ పాఠశాలకు మొదటి ర్యాంకు రావడం జరిగిందన్నారు. రెండవసారి కూడా పాఠశాలకు మొదటి ర్యాంకు రావడం చాలా గర్వించదగ్గ విషయమని, ఈ ర్యాంకు రావడానికి పిల్లల నైపుణ్యం, తల్లిదండ్రుల తోడ్పాటు, ఉపాధ్యాయుల కృషి, యాజమాన్యం యొక్క సూచనలే కారణమన్నారు. తమ పాఠశాలలో సుక్షితులైన అధ్యాపకులను నియమించుకోవడం, అత్యాధునిక బోధనా పద్ధతులను అమలు చేయడంలో రాజీ పోయే ప్రసక్తే లేదన్నారు. తమ పాఠశాల నంబర్ వన్ ర్యాంకు సాధించడానికి సహకరించిన పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.