మన ధ్యాస, నెల్లూరు, నవంబర్ 26:10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గొదన్గవే కమాండింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ వెంగళరావు నగర్, నెల్లూరు ఎన్సిసి సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా గుండాల నరేంద్రబాబు ఎన్సిసి క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ1947 ఆగస్ట్ 29న భారత రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచంలోని 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి తగిన రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల 11 మాసాల 18 రోజులు ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి భారత రాజ్యాంగాన్ని రచించి 1949 నవంబర్ 26 న రాజ్యాంగ పరిషత్ కు అందించగా భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించినది. ఈ శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీని భారత రాజ్యాంగ దినోత్సవం గా జరుపుకోవాలని 2015 ఏప్రిల్ 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, ప్రసిద్ధ సంఘసంస్కర్త,న్యాయవాది, రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పరమ దేశభక్తుడు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారని అప్పటినుండి ప్రతి ఏడాది నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవం గా దేశవ్యాప్తంగా అత్యంత ఆనందోత్సాహాల మధ్య నిర్వహిస్తున్నారని భారత రాజ్యాంగం 26 జనవరి 1950 నుంచి అమలులోకి వచ్చిందని ప్రభుత్వాలకు దశా దిశా నిర్దేశించేది భారత రాజ్యాంగం అని దాని విశిష్టతను ప్రాధాన్యతను ఈ సందర్భంగా నొక్కి వక్కాణించారు. భారతదేశానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా డా. బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి భారత రాజ్యాంగ ప్రవేశికను ముక్తకంఠంతో ప్రతినబూనారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని శ్రీమతి సి. మంజులవాణి, ఉపాధ్యాయులు విద్యార్థులు ఎన్సిసి క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *