తవణంపల్లి నవంబర్ 26 మన ద్యాస

తవణంపల్లి మండలంలోని ఐరాల క్రాసు నందు వినాయక విద్యా మందిర్ యాజమాన్యం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని బుధవారం వినాయక విద్యా మందిర్ యాజమాన్యం గణపతి నాయుడు వారి సౌజన్యం లో ఏర్పాటుచేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే మరియు నాయకులు కలిసి మొదటగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూజలు చేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని తెలియజేశారు. అనంతరం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని సభ ఆమోదించిందని, తర్వాత 1950 జనవరి 26న పూర్తిగా అమలులోకి వచ్చిందని తెలిపారు. 2015 నవంబర్ 26 నుంచి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆనవాయితీగా కొనసాగుతున్నదని, భారత రాజ్యాంగం రచించడంలో కీలకపాత్ర వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆయన జీవనశైలి గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి వారికి నచ్చిన రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థి అంబేద్కర్ వేషధారణలో అందర్నీ ఆకట్టుకోవడం జరిగింది. అనంతరం విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించి అసెంబ్లీలో అనేక విషయాలను కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కేక్ వచ్చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం రాయపాటి గణపతి నాయుడు, దేశం పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి, మాజీ అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ నాయుడు,పాక్స్ చైర్మన్ రంజిత్ రెడ్డి, గోపి యాదవ్, ఎంఈఓ హేమలత మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *