బడంగ్పేట్. మన ధ్యాస రంగారెడ్డి జిల్లా: విద్యా భారతి అఖిల భారతీయ శిక్ష సంస్థ అనుబంధ సంస్థ శ్రీ సరస్వతి శిశు మందిర్, బడంగ్పేట్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో “సప్తశక్తి సంగం” కార్యక్రమం మీర్పేట్ లోని లెనిన్ నగర్ సంస్కార్ కేంద్రంలో లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో “సమృద్ధ భారత్” సాధనకు అవసరమైన సప్తశక్తులను జాగృతం చేయడం ప్రధాన ఉద్దేశ్యంగా ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రసంగకర్తలు ప్రసంగిస్తూ ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంలో మహిళల బాధ్యతను నొక్కిచెప్పారు.సమాజ అభివృద్ధి, సాంస్కృతిక విలువల పరిరక్షణ, విద్యా శక్తి, ఆర్థిక స్వావలంబన వంటి అంశాల్లో మహిళలు ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ శిశు మందిర్ ఉపాధ్యాయులు పాల్గొని సప్తశక్తుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *