మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని తుఫాన్ బిల్డింగ్ మరియు టిపి నగర్ అప్పాపురం సంగం ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులకు ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం సోమరాజుపల్లి తెలుగుయువత అధ్యక్షులు షేక్ కరీముల్లా (డిల్లు) ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య , ఎంఆర్ఓ నున్న రాజేష్ , ఎంసీడీఓ జయమణి , సిఐ హాజరత్తయ్య, ఎస్సై మహేంద్ర , పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.అదనంగా, తెలుగుదేశం పార్టీ నాయకులు వేల్పుల వెంకట్రావు, షేక్ నాసీర్, శీలం చంటి, షేక్ రఫీ, మసనం రాజా, షేక్ ఖాదర్, షేక్ అన్వార్ మరియు సచివాలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని వరద బాధితులకు భోజనం అందజేశారు.






