మన ధ్యాస,నెల్లూరు రూరల్ ,అక్టోబర్ 23:కోటి యాభై లక్షల ఇరిగేషన్ స్థలం.. ప్రభుత్వ స్థలాలను కూడా అప్పనంగా రికార్డులను మార్చి అక్రమాలు చేసి తమ కాసుల కక్కుర్తి కోసం రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారుల మాయాజాలం… రిజిస్ట్రేషన్ కోసం జిల్లా కేంద్రంలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళితే జలగ పీడిచ్చినట్టు పీడిస్తున్న వైనం.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి పేద, మధ్యతరగతి ప్రజలు అనేకమంది ఫిర్యాదులు… అయ్యా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ఇది పరిస్థితి.. మీరు స్పందించండి… ఒక్క డాక్యుమెంట్ కోసం వేలాది రూపాయలు లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి.. లేకపోతే అనేక కొర్రీలు వేస్తున్నారు… పేదల ఎమ్మెల్యేగా మీరే న్యాయం చేయాలి అంటూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అనేకమంది వేడుకున్నారు. కొన్ని డాక్యుమెంట్ల కోసం లక్షల రూపాయలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి.నెల్లూరు మద్రాస్ బస్టాండ్, స్టోన్ హౌస్ పేట రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సంబంధించి వరుసగా అనేక మంది ఫిర్యాదులు రావడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. పేద మధ్యతరగతి ప్రజలను లంచాల కోసం జలగల్లా పీల్చి చేస్తున్న కొంతమంది అధికారులు సిబ్బంది, వ్యవహారంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధారాలతో సహా అనేక సమాచారాన్ని సేకరించారు. ప్రభుత్వ స్థలాలను అప్పనంగా రికార్డులను తారుమారు చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్న ఘటనలకు సంబంధించి ఫిర్యాదులు కూడా ఆయనకు ఉన్నాయి. దీంతో జిల్లా రిజిస్ట్రార్ ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు తన కార్యాలయంలో జరిగే సమీక్ష సమావేశానికి హాజరుకావాలని కోటంరెడ్డి సమాచారం అందించారు. మొత్తానికి నెల్లూరు మద్రాస్ బస్టాండ్ , స్టోన్ హౌస్ పేట రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను సమీక్ష సమావేశంలో కోటంరెడ్డి ఆధారాలతో సహా నిలదీసి హెచ్చరిక జారీ చేయనున్నారు.









