వెదురుకుప్పం, , మన ధ్యాస అక్టోబర్ 23:వెదురుకుప్పం మండలం తెట్టుగుంటపల్లి గ్రామానికి చెందిన మణికంఠ తల్లి బుజ్జమ్మ ఇటీవల మరణించారు. ఆమె కర్మక్రియలు గురువారం నాడు గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్, బూత్ కన్వీనర్లు సువ్వాల ముని రాజారెడ్డి, మల్లికార్జున్ యాదవ్, కావలి మురళీమోహన్, భాను, జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా కార్యదర్శి పాముల శేషాద్రి, సీనియర్ నాయకులు పుల్లూరు సుధాకర్ రెడ్డి, యువ నాయకులు అరగొండ మురళీమోహన్ రెడ్డి, మునికృష్ణ రెడ్డి కుమార్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.బుజ్జమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని నాయకులు ఆకాంక్షించారు.







