మన ధ్యాస, చిత్తూరు, సెప్టెంబర్-19 కూటమి ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల ప్రవేటికరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మదనపల్లె మెడికల్ కళాశాల ప్రాంగణంలో కదం తొక్కిన ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన, విద్యార్థి ,సోషల్ మీడియా,

మరియు అనుబంధ విభాగాలు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలకు 8500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇప్పటికే ఐదు కాలేజీలు పూర్తయి ప్రారంభించారు కూడా. కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న ఒక్క ఇటుక కూడా పేర్చకుండా పబ్బం గడుపుతూ చేసేది ఏమీ లేక జగనన్న కట్టించిన మెడికల్ కాలేజీలు అన్ని ప్రైవేటీకరణ చేస్తూ వైద్య విద్యార్థులకు పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తోంది.. ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర ప్రజలు, పేద వైద్య విద్యార్థులు ప్రతి ఒక్కరు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ,జిల్లా నలుమూలల నుంచి యువజన విభాగం ,విద్యార్థులు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *