బంగారుపాళ్యం సెప్టెంబర్ 17 మన ద్యాస

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం, సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శిరీష బుధవారం మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన స్వస్త్ నారి స్వశక్త్ పరివార్ లో భాగంగా స్రి ఎంత ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా పటిష్టంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమం 15 రోజులపాటు అక్టోబర్ 2 తేదీ వరకు నిర్వహించబడుతుందని, దీని యొక్క ముఖ్య ఉద్దేశం స్త్రీలకు, గర్భిణీలకు, క్యాన్సర్ స్క్రీనింగ్ పి ఎం ఎం ఈ వై, గర్భవతులకు స్కానింగ్, ఎన్సిపి కార్డ్స్, బిపి షుగర్ వంటి పరీక్షలు ఈ క్యాంపు నందు నిర్వహించబడునని తెలిపారు.ఈ సదా అవకాశాన్ని మండలంలోని ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ శిరీష తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, తెలుగుదేశం పార్టీ మండల జనరల్ సెక్రెటరీ జనార్దన్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ హేమచంద్ర నాయుడు, లోకనాథ నాయుడు, ఎన్ పీ రాధాకృష్ణ, మాధవ నాయుడు, సూరి నాయుడు, హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *