

మన ధ్యాస,నెల్లూరు రూరల్, ఆగస్టు 30 :*వైసీపీ అరాచక మూలాలతోనే తాజా పరిణామాలు.*అరాచక శక్తులను కూకటివేళ్లతో సహా పెకిలించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అవసరం.*కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర వెనకున్న అసలు వ్యక్తులెవరో తేలాలి.మన ధ్యాస ,నెల్లూరు రూరల్ ,ఆగస్టు 30 :నెల్లూరులోని సరస్వతినగర్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డితో భేటీ అయిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కోటంరెడ్డికి సంఘీభావం ప్రకటించి తాజా పరిణామాలపై చర్చించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.ఈ సందర్భంగా మీడియాతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ…….నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చాలా దురదృష్టకరం అని అన్నారు.గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు కందుకూరు కలిపి 11 సీట్లు కోల్పోవడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది అని అన్నారు.రౌడీ గ్యాంగులు కుట్రలు చేస్తున్న ఘటనలను పోలీసులు, ఇంటిలిజెన్స్ సీరియస్ గా తీసుకోవాలి అని అన్నారు.సర్వేపల్లిలో కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు మా నాయకులపై దాడులకు తెగబడ్డారు అని అన్నారు.కావలిలో కావ్యా కృష్ణారెడ్డి హత్యకు డ్రోన్లు, కత్తులతో ప్లాన్ చేశారు అని అన్నారు.ఇఫ్పుడు నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎత్తేస్తామంటున్నారు అని అన్నారు.నిన్న వెలుగుజూసిన వీడియో పాతది కాదని, ఇటీవలే జరిగిన కుట్రగా తెలుస్తోంది అని అన్నారు.పోలీసులు కొంత గట్టిగా వ్యవహరించాల్సివుంది. క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాల చర్యలు ఉండాలి అని అన్నారు.కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీ గ్యాంగులు చెలరేగిపోతుండటం సహించరాని విషయం అని అన్నారు.ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు జిల్లాలో జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు అవసరమైతే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దించాలి అని అన్నారు.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ప్లాన్ చేసిన వారి విషయంలో సీరియస్ గా చర్యలు తీసుకోవాలి అని అన్నారు.దాదాపు ఏడు, ఎనిమిది మంది వీడియోలో కనిపిస్తున్నారు అని అన్నారు.అసలు సూత్రధారులెవరు, ఆ రౌడీల వెనుక ఉన్న నేతలెవరో తేల్చాల్సిన అవసరం ఉంది అని అన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు దాటుతున్నా రౌడీ గ్యాంగుల కదలికలను పోలీసులు ఎందుకు కనిపెట్టలేకపోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అని అన్నారు.జగన్ రెడ్డి నెల్లూరుకు వచ్చిన రోజు హెడ్ కానిస్టేబుల్ కాలు విరగ్గొట్టారు అని అన్నారు.గతంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చోటుచేసుకోలేదు అని అన్నారు.వైసీపీ ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను సర్వనానశం చేశారు..జిల్లాకు చెడ్డపేరు తెచ్చారు అని అన్నారు.రౌడీలను మూలాలతో సహా పెకిలించి నెల్లూరును ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంచాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది అని అన్నారు.క్రిమినల్స్ పై చర్యలు తీసుకునే విషయంలో ప్రజాప్రతినిధులందరం పోలీసులకు సంపూర్ణ సహకారం అందిస్తాం అని అన్నారు.శ్రీధర్ రెడ్డికి ప్రాణాపాయముందని తెలిసిన వెంటనే ఆయనను అప్రమత్తం చేయడంతో పాటు అదనపు భద్రత కల్పించాల్సింది అని అన్నారు.జగన్ రెడ్డి సీఎం అయిన తెల్లారి నుంచే అన్నపూర్ణ లాంటి ఏపీని అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చారు..ఇప్పటికీ ఆ మూలాలు కొనసాగుతున్నాయి అని అన్నారు.అరాచకాలను మా కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ ప్రోత్సహించరు అని అన్నారు.మా చేతులు కట్టేసివున్నారనే విషయం నాలుగు రోజుల క్రితమే శ్రీధర్ రెడ్డి కూడా గుర్తు చేశారు అని అన్నారు.గత ప్రభుత్వంలో ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే 50 మందికి పైగా అక్రమ కేసులతో జైళ్లకు పంపారు అని అన్నారు.ఇప్పుడు మేం తప్పు చేసిన వారిని మాత్రమే జైళ్లకు పంపించాలని పోలీసు అధికారులకు సూచిస్తున్నాం అని అన్నారు.
