నెల్లూరును భారతదేశంలో మోడల్ సిటీగా తీర్చిదిద్దటమే నా లక్ష్యం……. రాష్ట్ర పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 30 :- 14వ డివిజన్లో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ- డివిజన్ కు విచ్చేసిన మంత్రికి ఘన స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు, స్థానిక ప్రజలు- శరవేగంగా ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకం పనులు- ఇప్పటికే మూడు మదర్ ప్లాంట్లు ప్రారంభం – ఒక్కొక్క మదర్ ప్లాంట్ నుండి రోజుకి లక్ష లీటర్ల తాగునీరు – రెండు రూపాయలకే 20 లీటర్ల తాగునీరు – మరో ఏడాదిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి – నగరంలోని మరో 15 ప్రభుత్వ పాఠశాలలకు నూతన హంగులు – ప్రజలు కాస్తంత ఓపిక పడితే చెప్పినవన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చిన మంత్రి నారాయణ మన ధ్యాస ,నెల్లూరు ,ఆగస్టు 30:నెల్లూరును భారత దేశంలోనే మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, ఇందులో భాగంగా డిసెంబర్ నెలాఖరు నాటికి నెల్లూరు నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే ధ్యేయంగా ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్లో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటికి సంబంధించి మదర్ ప్లాంట్ ను, స్మాల్ ప్లాంట్ ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. డివిజన్ కి చేసిన మంత్రికి స్థానిక టిడిపి శ్రేణులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ మంత్రి నారాయణ ముందుకు కదిలారు. టిడిపి శ్రేణులతో కలిసి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించార. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. నగర నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేస్తున్న మదర్ ప్లాంట్ వల్ల ఒక్క రోజుకి లక్ష లీటర్ల తాగునీరు ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని 2014-19 లో టిడిపి హయాంలోనే ప్రవేశపెట్టామని, అయితే గత ప్రభుత్వం తమ మీద కోపంతో ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఆ పథకాన్ని ఆపేసిందని దుయ్యబట్టారు. కేవలం రెండు రూపాయలకే 20 లీటర్ల తాగునీటిని ప్రజలకు అందించేందుకు అప్పట్లోనే ప్రణాళికలు రూపొందించి అందుకు సంబంధించి నిధులు కూడా మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఇందుకోసం ఆరు మదర్ ప్లాంట్ల ఏర్పాటుకు, వాటి ద్వారా సిటీ నియోజకవర్గ పరిధిలో 60 ప్లాంట్లు, రూరల్ నియోజకవర్గం లో మరో 60 ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు చేపట్టామన్నారు. అయితే అంతటి గొప్ప పథకాన్ని గత ప్రభుత్వం ఆపేసిందని, కాని కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకానికి పునః ప్రారంభం చేపడుతున్నామని మంత్రి తెలియజేశారు. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు మూడు మదర్ ప్లాంట్లను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిక్షణం విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. తద్వారా దోమల లేని నగరంగా నెల్లూరు రూపుదిద్దుకోబోతుందని స్పష్టం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరో సంవత్సరం లోపల పూర్తి కాబోతుందని, ఆ వెంటనే ప్రతి ఇంటి వారు తమ ఇళ్ల నుంచి రూపాయి ఫీజుతో డ్రైనేజీ కనెక్షన్ మీరే ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 35 పార్కులకు నూతన హంగులు తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. నెల్లూరు నగరంలోని 15 ప్రభుత్వ పాఠశాలలను వీఆర్ఐ స్కూల్ కంటే మెరుగ్గా దాతల సహకారంతో తీర్చిదిద్దబోతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్ల కోసం టెండర్లను పిలవడం జరిగిందన్నారు. త్వరలో నెల్లూరు నగరంలో ఎక్కడ కూడా మట్టి రోడ్డు అనేది కనిపించకుండా రూపుదిద్దుకోబోతుందన్నారు. అదేవిధంగా అల్లిపురం, దొంతాలి ప్రాంతాల్లో పేరుకుపోయిన లెగసీని ప్రణాళిక బద్ధంగా అక్టోబర్ రెండవ తేదీకి క్లీన్ చేస్తున్నట్లు చెప్పారు. నెల్లూరు ను భారతదేశంలోనే మోడల్ సిటీగా తీర్చిదిద్దనమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రజలు కాస్తంత ఓపిక పడితే చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, 14 డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్,ప్రెసిడెంట్ పసుపులేటి మల్లికార్జున ,క్లస్టర్ ఇంచార్జ్ బుచ్చి భూనేశ్వర్ ప్రసాద్, పబ్లిక్ హెల్త్ SC మోహన్ రావు.. టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..