

మర్రిపాడు,మన న్యూస్ ఆగస్టు 18://
తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లినేని వెంకట రామారావు సోమవారం మర్రిపాడులోని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేక పాటి. చంద్రశేఖర్ రెడ్డి శాంతమ్మల దంపతులు ఆధ్వర్యంలో వారి నివాసంలోజరుగుతున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం కు హాజరయ్యారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బొల్లినేనికి. వెంకట రామారావుకు ఆహ్వానం పలికారు. కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన ప్రజలకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిబొల్లినేని వెంకట రామారావు లు అభివాదం చేస్తూ స్వామి కళ్యాణం వేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటికి అక్కడ ఆశీస్సులైన ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మినాయుడును ఆత్మీయంగా పలకరించారు. స్వామివారి కల్యాణమును తిలకించారు. కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన నియోజకవర్గం పరిధిలోని అనేకమంది మాజీ ఎమ్మెల్యే బొల్లునేని వెంకట రామారావుku అభివాదం చేస్తూ కరచాలం చేశారు. అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ కళ్యాణం మహోత్సవం తిలకించారు.